Share News

79th Independence Day: దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం.. స్వాతంత్ర్య వేడుకల్లో మోదీ ప్రసంగం..

ABN , Publish Date - Aug 15 , 2025 | 07:46 AM

79th Independence Day Celebrations: స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

79th Independence Day: దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం.. స్వాతంత్ర్య వేడుకల్లో మోదీ ప్రసంగం..
79th Independence Day Celebrations

స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.


రాజ్యాంగం మనకు అనునిత్యం మార్గదర్శనం చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతల సేవలను నిత్యం గుర్తుచేసుకుంటున్నాం. రాజ్యాంగం కోసం బలిదానం చేసిన తొలివ్యక్తి శ్యామప్రసాద్‌ ముఖర్జీ. శ్యామప్రసాద్‌ ముఖర్జీ త్యాగం మరువలేనిది. ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్‌. మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు. భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారు’ అని అన్నారు.


ఆపరేషన్ సిందూర్‌తో సత్తా చాటాం

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘పహల్గామ్‌ దాడితో యావత్‌ దేశం ఆక్రోశంతో రగిలిపోయింది. ఆ ఆక్రోశానికి సమాధానంగానే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాం. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. యుద్ధతంత్రాలు, వ్యూహాలు పూర్తిగా మన జవాన్లే తయారుచేసుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటాం. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు నిద్ర పట్టకుండా చేశాం. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ధి చెప్పింది. ఇకపై బ్లాక్‌మెయిల్‌ చేసేవారిని ఉపేక్షించేది లేదు. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడేది లేదు. మానవాళి మనుగడకు ఉగ్రవాదులు ప్రమాదకరం వికసిత్‌ భారత్‌కి ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదమే ఆధారం. సింధూ నదిలో నీరు భారత రైతుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి

పిచ్చి పీక్స్.. వైరల్ లబూబు బొమ్మకు పూజలు..

మీది చురుకైన చూపు అయితే.. ఈ ఫొటోలో పండును 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Aug 15 , 2025 | 09:25 AM