Share News

Viral Labubu Doll: పిచ్చి పీక్స్.. వైరల్ లబూబు బొమ్మకు పూజలు..

ABN , Publish Date - Aug 15 , 2025 | 07:01 AM

Viral Labubu Doll: ఆ బొమ్మ చూడ్డానికి వింతగా ఉండటంతో.. ఏం బొమ్మ అని అడిగింది. అప్పుడు ఆ యువతి ‘ఇది చైనా వాళ్ల దేవుడు’ అని చెప్పింది. ఆ తల్లి కూతురి మాటలు నమ్మింది.

Viral Labubu Doll: పిచ్చి పీక్స్.. వైరల్ లబూబు బొమ్మకు పూజలు..
Viral Labubu Doll

చైనాకు చెందిన వైరల్ బొమ్మ లబూబు ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. ఇంటర్‌నెట్‌లో లబూబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడ్డానికి వింతగా, భయంకరంగా ఉండే ఈ లబూబు బొమ్మకు ఇండియాలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా, ఓ అమ్మాయి చేసిన పనికి ఆమె తల్లి లబూబు బొమ్మకు పూజలు చేయటం మొదలెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర భారత దేశానికి చెందిన ఓ మహిళ తన కూతురి దగ్గర ఉన్న లబూబు బొమ్మను చూసింది.


ఆ బొమ్మ చూడ్డానికి వింతగా ఉండటంతో.. ఏం బొమ్మ అని అడిగింది. అప్పుడు ఆ యువతి ‘ఇది చైనా వాళ్ల దేవుడు’ అని చెప్పింది. ఆ తల్లి కూతురి మాటలు నమ్మింది. వెంటనే ఆ బొమ్మను దేవుడి పటాల దగ్గరకు తీసుకెళ్లింది. దానికి పూజలు చేయటం మొదలెట్టింది. తర్వాత బొమ్మను భర్త దగ్గరకు తీసుకెళ్లింది. అతడు ఆ బొమ్మకు దండం పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..


‘నువ్వు ఇలా చేసి హిందూయిజాన్ని కించపర్చటం లేదు. మీ అమ్మ అమాయకత్వాన్ని కించపరుస్తున్నావు. నువ్వు కూడా ఓ స్త్రీవే కదా. అలా ఎలా చేస్తావు’..‘చైనా వాళ్లు కూడా మన దేవుల్ని గౌరవిస్తారు. అలాంటిది ఓ ఇండియన్‌వి అయిఉండి.. హిందూ మతానికి చెందిన దానివి అయి ఉండి. ఇలా ఎలా చేస్తావు. మన దేవుళ్లను మనమే కించపరుచుకుంటామా?’..‘ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మళ్ళీ ఇలా బయటపడుతున్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ర్యాపిడ్‌లో గుకే్‌షకు 4వ స్థానం

అభిమానులపై జగన్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ పిడిగుద్దులు

Updated Date - Aug 15 , 2025 | 07:04 AM