Jagans Private Security Assaults: అభిమానులపై జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ పిడిగుద్దులు
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:06 AM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు వచ్చినవారిపై ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది..
ఆస్పత్రి పాలైన మహిళ
అనంతపురం కలెక్టరేట్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు వచ్చినవారిపై ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది(బౌన్సర్లు) పిడిగుద్దులు కురిపించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి జగన్ హాజరయ్యారు. కల్యాణమండపంలోకి జగన్ వెళ్తున్న సమయంలో ఆయనను దగ్గర నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు కొందరు రోప్ పార్టీని దాటుకొని దూసుకొచ్చారు. తోపులాట చోటుచేసుకోవడంతో బౌన్సర్లు జనంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో అంజలి అనే మహిళ అస్వస్థతకు గురై కింద పడిపోయారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అభిమానులపై బౌన్సర్లు దాడి చేస్తున్నా జగన్ వారించకపోవడం గమనార్హం. కాగా, జగన్ వస్తుండటంతో వైసీపీ నాయకులు లారీలలో జనాలను తరలించారు.