Wishes : దేశ ప్రజలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్న ప్రముఖులు
ABN , Publish Date - Aug 15 , 2025 | 07:39 AM
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ 79వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసుకోవడానికి, వికసిత్ భారత్‌ను నిర్మించడం కోసం మనల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించుగాక.
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ 79వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 'అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసుకోవడానికి, వికసిత్ భారత్‌ను నిర్మించడం కోసం మనల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించుగాక. జై హింద్!' అని ప్రధాని తన సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో తెలిపారు.
అటు, తెలుగులో కూడా ప్రధాని తన సందేశాన్నిచ్చారు. ప్రధానితో పాటు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు భారత ప్రజలకు ఇండిపెండెన్స్ డే విషెస్ చెబుతున్నారు.
భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సందేశంలో 'దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలో అన్ని విధాలా బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దాం.' అని చెప్పారు. #IndependenceDay2025 ట్యాగ్ చేశారు.