PM Modi: భారత్‌కు స్వంతంగా ఓ అంతరిక్ష కేంద్రం.. ఎర్రకోట నుంచి ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:14 AM
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పౌరులను ఉద్దేశిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతరిక్ష రంగంలో భారతదేశం స్వావలంబన సాధించే దిశగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు (Independence day Celebrations). అనంతరం పౌరులను ఉద్దేశిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షయానం పూర్తి చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla)ను ప్రత్యేకంగా అభినందించారు.
అంతరిక్ష రంగంలో కూడా భారతదేశం స్వావలంబన సాధించడానికి కృషి చేస్తోందని, గగన్‌యాన్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోందని ప్రధాని తెలిపారు. 'మన అంతరిక్ష రంగం పట్ల దేశం గర్విస్తోంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చారు. త్వరలోనే ఆయన భారతదేశానికి తిరిగి వస్తారు' అని ప్రధాని వ్యాఖ్యానించారు. త్వరలోనే భారత్ స్వంత అంతరిక్ష కేంద్రాన్ని (Space Station) ఏర్పాటు చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని, అవి అంతరిక్ష రంగంలో పని చేస్తున్న 300కు పైగా స్టార్టప్ కంపెనీలకు మేలు చేకూరుస్తాయని ప్రధాని పేర్కొన్నారు. వేలాది మంది యువతీయువకులు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్నారని, ఇది మన యువ శక్తిపై మనకు ఉన్న నమ్మకం అని వ్యాఖ్యానించారు. అలాగే అణు ఇంధన రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ 65 లక్షల మంది పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
ధర్మస్థల కేసులో ఆశ్చర్యకర నిజాలు..ఆ 80 శవాలు నేనే పాతిపెట్టా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి