Home » ICC
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పింది. ఈ అంశంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు.
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. పీసీబీ ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరింది.
బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ ఆటగాళ్ల కోసం ఓ కొత్త టీ20 టోర్నమెంట్‌ను ప్రారంభించనుంది. దీనికి ఓడోమ్మో బంగ్లాదేశ్ టీ20 కప్ 2026 అని పేరు పెట్టింది.
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్‌ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ నిర్ణయాల వల్ల రోజుకో వివాదం తెరమీదకి వస్తోంది. ఈ టోర్నీలో పాక్ ఆడటంపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ చెప్పింది. ఒకవేళ పాక్ ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.
టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లా విషయంలో ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ బంగ్లాను రెచ్చగొడుతోందని.. ఇది పద్ధతి కాదని ఆయన వెల్లడించారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ భేటీ ముగిసింది. అనంతరం నఖ్వీ పలు అంశాలను వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.
పీసీబీ ఛైర్మన్ నఖ్విపై టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి తొలగించడంపై నఖ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో పాకిస్తాన్ జోక్యం ఎందుకు అంటూ భజ్జీ ప్రశ్నించాడు.