మా ప్రభుత్వం కారణంగా మేం నవ్వులపాలయ్యాం.. బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:30 PM
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లామ్ ప్రభావితమయ్యారని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలను సాకుగా చూపి భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లామ్ ప్రభావితమయ్యారని ఆరోపించారు.
‘ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా నేను నిబద్దత, నిజాయతీని విశ్వసిస్తాను. అమీనుల్ ఇస్లామ్ అమాయకుడు. అతడు నఖ్వీ వలలో పడ్డాడు. నఖ్వీనే అమీనుల్‌ను ఈ విషయంలో బలవంతం చేశాడు. కానీ అతడి మాటలు విని ఏం సాధించాం? ప్రపంచ కప్ వివాదం సమయంలో మా ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే అందుకు సరైన కారణాలు లేవు. అలాగే బంగ్లాదేశ్‌కు భారత క్రికెట్ నిర్వాహకుల మద్దతు అవసరం. జగన్మోహన్ దాల్మియా కాలంలో మాకు గౌరవం, గుర్తింపు ఉండేది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు, మా ప్రభుత్వ చర్యల కారణంగా మేం నవ్వుల పాలయ్యాం’ అని సయ్యద్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్ బై
మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్