Home » Hyderabad
సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ డాక్టర్ భారీగా నగదును పోగొట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను సైబర్ కేటుగాళ్లు ఈజీగా మోసం చేసి పెద్ద మొత్తంలో నగదును కొట్టేశారు.
గ్యాస్ డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన గాదె అజయ్ అనే యువకుడు గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ.. గంజాయిని కూడా సరఫరా చేస్తున్నాడు. సమాచారమందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను వెంటాడుతాం.. అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల్లో జీఓ46ను తీసుకొచ్చి బీసీలను ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌ను ఏం చేశారన్న దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆ అటు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు సిటీ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ రివాల్వర్‌కు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్లను నిరుపేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు.. అంటూ సిబ్బందికి సిటీ పొలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోతే అసాంఘిక శక్తులు పెరిగిపోతాయని, పోలీసులు ప్రతిక్షణం అలెర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు.
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా కేజీ రూ. 50కి పైగానే ఉన్న ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం రూ. 35కి విక్రయిస్తున్నారు. అయితే.. బెండకాయకు ధర పెరిగింది. కిలో రూ. 45 నుంచి రూ. 55 వరకు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
నగరంలో ఆయా ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్ల తెలిపారు. వినియోగదాలు సహకరించాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
గన్ మిస్సింగ్ కేసులో అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గన్ ఎక్కడపెట్టానో తెలీదంటూ ఎస్ఐ చెబుతున్నట్లు సమాచారం.