Home » Hyderabad
వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆపార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని హైదరాబాద్ లో బలోపేతం చేయడమేగాక త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సీవోపీడీ ఊపిరితిత్తులలో అవరోధాన్ని కలిగించే జబ్బు. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాలుష్యంలో తిరిగే, ఫ్యాక్టరీల్లో పనిచేసే, రసాయనిక, ఆభరణాలకు పూత పూసే వారిలో, స్మోకర్స్, పాసివ్ స్మోకర్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు వివరించారు.
భాగ్యనగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఊపిరి ఆగకుండా ఉండాలంటే పొగతాగడం ఆపాల్సిందేనని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భంగా ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి సీఓపీడీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్‌లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ తదితరులు పరామర్శించారు.
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో హెచ్చరించారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు.
భాగ్యనగరంలోని ప్రముఖ హోటల్స్ యజమానుల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.