Home » Hyderabad News
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కోర్ట్ తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దె చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చలు కొనసాగానున్నాయి
ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేతలు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుభరోసా రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం రూ.12 వేల చోప్పున 9 రోజుల్లో 9 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు.
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ముంపునకు గురవుతుండడానికి నాలాల ఆక్రమణే కారణమని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించి DPR సిద్ధం చేస్తున్నట్లు, వరంగల్‌ను ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి.
హైకోర్టులో భారతి ఎయిర్‌టెల్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు.. రూ.21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పరిమిషన్ వచ్చిన తర్వతే.. విద్యుత్ స్తంభాలపై నుంచి వైర్లు వేసామని పేర్కొన్నారు.
కరెంట్ స్తంభాలపై టీవీ కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్‌వర్క్ వైర్లు అడ్డగోలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్తంభాలపై ఉన్న వైర్లను తొలగిస్తున్నారు అధికారులు. నిన్నటి నుంచి విద్యుత్ స్తంభాలపై ఉన్న వేలాది కేబుల్ వైర్లను, ఫైబర్ వైర్లను తొలగిస్తున్నట్లు చెప్పారు.
24 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ.1,00,750 ఉంటే ఈ రోజు రూ.10 తగ్గి రూ.1,00,740 చేరింది. అలాగే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ. 92,350 ఉంటే ఈ రోజు రూ.10 తగ్గి 92,340 చేరుకుంది.
కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక సహస్రిని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హతమార్చాడు.
గాంధీ ఆసుపత్రికి సోహెల్ అనే ఖైదీని రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకొచ్చారు. అయితే సోహెల్ చాకచక్యంగా.. బాత్‌రూమ్ వస్తుందని చెప్పి బాత్‌రూమ్‌లోకి ప్రవేశించాడు.