Share News

Gandhi Hospital: బాత్‌రూమ్‌ కిటికీలో నుంచి దొంగ పరార్..

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:17 AM

గాంధీ ఆసుపత్రికి సోహెల్‌ అనే ఖైదీని రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకొచ్చారు. అయితే సోహెల్‌ చాకచక్యంగా.. బాత్‌రూమ్ వస్తుందని చెప్పి బాత్‌రూమ్‌లోకి ప్రవేశించాడు.

Gandhi Hospital: బాత్‌రూమ్‌ కిటికీలో నుంచి దొంగ పరార్..
Gandhi Hospital

హైదరాబాద్: ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఏదో ఒక పథకం పన్ని ఖైదీ తప్పించుకుపోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం. పోలీసులను మాటల్లో పెట్టి.. పోలీసులను మాయ చేసి ఖైదీలు తప్పించుకుంటారు. అదే సినిమా టైప్ ఇన్సిండెంట్ నగరంలో రిపీట్ అయ్యింది. వైద్య పరీక్షలు కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు.


గాంధీ ఆసుపత్రికి సోహెల్‌ అనే ఖైదీని రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకొచ్చారు. అయితే సోహెల్‌ చాకచక్యంగా.. బాత్‌రూమ్ వస్తుందని చెప్పి బాత్‌రూమ్‌లోకి ప్రవేశించాడు. బాత్‌రూమ్‌లో కిటికీ తొలగించడానికి అదునుగా ఉండటం గమనించి కిటికీ తొలగించి అందులో నుంచి పరారయ్యాడు. సోహెల్‌ ఎంతకు బాత్‌రూమ్‌ నుంచి రాకపోయే సరికి పోలీసులు బాత్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా.. కంగుతిన్నారు. దొంగతనం కేసులో సోహెల్‌‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోహెల్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే

భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం

Updated Date - Aug 19 , 2025 | 10:28 AM