Kukatpally Murder Case: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక పరిణామం..
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:36 AM
కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక సహస్రిని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హతమార్చాడు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన కూకట్‌పల్లి మైనర్ బాలిక సహస్ర మర్డర్ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఒక అనుమాతుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ఉంటున్న బిల్డింగ్‌లోనే అద్దెకు ఉంటున్న సంజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక సహస్ర హత్య తరువాత సంజయ్ అక్కడకక్కడే అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ అనుమానంతో సంజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక సహస్రని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. బాలిక గొంతుకోసి.. ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా చంపేశాడు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉన్న వందల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దుండగుడు ఇంట్లో చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించి ఉంటాడని.. తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాలిక ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
అయితే బాలికపై చిన్న పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలిక ఒంటిపై 20కి పైగా కత్తి పోట్లు ఉన్నాయని తెలిపారు. ఎక్కువగా మెడ భాగంలో కత్తిపోట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేసు దర్యాప్తు కోసం ఐదు టీములు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామన్నారు. హత్య జరిగిన ఇంటికి సంబంధించిన ఫుటేజ్ లభ్యం అయినట్లు పోలీసులు వెల్లడించారు.