Home » Hyderabad News
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను నియమించామని తెలిపారు.
తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి.. చరిత్ర సృష్టించాయి.
తెలంగాణ బతుకమ్మ వేడుకకు 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి బతుకమ్మ వేడుక నమోదైంది. పది వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకుని ఫలితాన్ని ప్రకటించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
హైడ్రా కూల్చివేసి వివరాలు చెప్పాక నాగార్జున వాస్తవం గ్రహించారని సీఎం రేవంత్ తెలిపారు. కబ్జా చేసిన రెండెకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశారని పేర్కొన్నారు.
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారని తెలిపారు.
మూసరంబాగ్ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి రెండేళ్లు అయ్యిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. త్వరగా ఈ బ్రిడ్జి పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ కుంటకు VHR బతుకమ్మ కుంటగా నామకరణం చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఆల్మట్టిని అడ్డుకునే దమ్ముంటే రాహుల్ గాంధీతో చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఎత్తును అడ్డుకోవాలని సవాల్ విసిరారు కేటీఆర్. గతంలో ఆర్డినెన్స్‌పై గట్టిగా హెచ్చరించిన పులి మాజీ సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఆరు ఎస్టీపీలను 332 ఎంఎల్‍డీల సామర్థ్యంతో జలమండలి నిర్మించింది. రూ.319.43 కోట్లతో 212 ఎంఎల్‍డీ సామర్థ్యంతో అంబర్ పేట ఎస్టీపీ నిర్మించారు.
గుడిపేటలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కారులో నోట్ల మార్పిడి చేస్తుండగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.