Home » Hyderabad City Police
డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.
అధికారుల సమన్వయంతో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడు మొహమ్మద్ ఉస్మాన్‌ను పంజాబ్‌లోని అటారి సరిహద్దు ద్వారా డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011లో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌లో ప్రవేశించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
నగరంలో ఇంకా 4,700 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. స్వామి విగ్రహాలతో నిండిన భారీ వాహనాలతోనే రోడ్లు నిండిపోయాయి.
ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్‌లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జనం స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఆర్థిక కష్టాలతో ఉన్నా నిందితుడికి కుందేలు నిర్వహణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావిడి చేసిన నిందితుడు.. కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు..? చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు.
మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.యాజులు మేడూరి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన నార్కోటిక్స్ కేసులో తమ యూనివర్సిటీ విద్యార్థుల ప్రమేయం ఉందని వెలువడిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు కావడంతో గణేశ్ వద్ద భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపడుతున్నారు.