Hyderabad Rave Party: నగరంలో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:13 PM
ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో తరచూ రేవ్ పార్టీ ఉదంతాలు వెలుగులోకి వస్తోన్నాయి. తాజాగా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మంగళవారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
రంగారెడ్డి: మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం రేపింది. లింగంపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫాం హౌస్‌పై పోలీసులు దాడి చేసి రేవ్‌పార్టీని భగ్నం చేశారు. రేవ్‌పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2 లక్షల 40 వేల నగదు, 15 మొబైల్ ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే.. స్వాధీనం చేసుకున్న వాహనాలలో ఎమ్మెల్సీ వాహనం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ స్టీకర్ ఉన్న వాహనాన్ని పోలీసులు కనపడకుండా దాచేస్తున్నారని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే వాహనంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టిక్కర్లు, వాహనం లోపల కండువాలు కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ కనిపించకుండా వైట్ పేపర్‌ను పోలీసులు అతికించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో తరచూ రేవ్ పార్టీ ఉదంతాలు వెలుగులోకి వస్తోన్నాయి. తాజాగా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మంగళవారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనిలో 72 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గాజుల రామారానికి చెందిన తిరుపతిరెడ్డి, రాక్ స్టార్ ఫెర్టిలైజర్స్ సైదారెడ్డి వివిధ ప్రాంతాలకు చెందిన డీలర్స్‌తో రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు
The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి