Home » High Court
మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన కేసులో పలువురు నిందితులకు హైకోర్టు గట్టి షాకిచ్చింది. దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ1), తూకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి(ఏ3), కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(ఏ4) దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను సోమవారం కొట్టివేసింది.
మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం చిన్న వ్యవహారం కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడు జానీసైదా బాలికను కిడ్నాప్ చేసి ఎక్కడకు తీసుకెళ్లాడు.. వారు ఇంతకాలం ఎక్కడున్నారు..? బాలికను తీసుకెళ్లేందుకు సహకరించిన వారెవరు..? వారికి ఆశ్రయం కల్పించింది ఎవరు..? బాలిక మైనర్ అని తెలిసి కూడా లాడ్జిల్లో గదులు ఎలా ఇచ్చారు..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈడీ ఆరోపణలపై విచారణ కోరినందుకు తనను ప్రభుత్వ సంస్థలు వేధిస్తున్నాయని పంజాబ్ న్యాయవాది నిఖిల్ కోర్టును ఆశ్రయించారు. తన ఫామ్‌హౌస్‌ను కూల్చేందుకు యత్నిస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, 33.33% చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవోలు సరైనవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. శాస్త్రీయ సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయమై మంత్రి టీజీ భరత్ స్పందించారు. ఈ నిర్ణయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలోనే ఈ హామీని నెరవేరుస్తామన్నారు.
పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యం కేసులో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాలిక ఆచూకీ తెలియకుంటే కోర్టు ముందుకు వచ్చి మరింత సమయం కోరాలని, అంతేతప్ప సిట్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ‘అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ సరిహద్దులను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ జనాభా లెక్కల సేకరణ కోసమే పరిమితమని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఎలాంటి ప్రభావం చూపదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు.
జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ 2016లోని నిబంధనల ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరంగా పేర్కొంటూ షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.