Share News

OG movie Ticket Price: ఓజీ టికెట్ల వివాదం.. నో చెప్పేసిన హైకోర్టు

ABN , Publish Date - Sep 26 , 2025 | 04:31 PM

టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అక్టోబర్ 9 వరకు ఇదే ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

OG movie Ticket Price: ఓజీ టికెట్ల వివాదం..  నో చెప్పేసిన హైకోర్టు
OG movie Ticket Price

హైదరాబాద్, సెప్టెంబర్ 26: టికెట్ల ధరలు పెంపునకు సంబంధించి ఓజీ చిత్ర బృందానికి మరో షాక్ తగిలింది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawar Star Pawan Kalyan) నటించిన ఓజీ మూవీ టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఈరోజు (శుక్రవారం) మరోసారి విచారణ జరిగింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొనసాగించేలా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అక్టోబర్ 9 వరకూ ఈ ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.


కాగా.. ఓజీ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓజీ ప్రీమియర్ షోలతోపాటు, విడుదల తేదీ నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. అంటే సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 వరకు టికెట్ ధరను పెంచుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని సవాల్‌ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


దీనిపై ఈనెల 24న సింగిల్‌ బెంచ్‌లో విచారణ జరిగింది. సినిమా టికెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చిత్ర బృందం డివిజన్ బెంచ్‌‌లో పిటిషన్ వేయగా నిన్న విచారణ జరిగింది. ఈ క్రమంలో సింగిల్‌ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ నేటి (శుక్రవారం) వరకు స్టే విధించింది. దీంతో ఈరోజు మరోసారి టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగగా.. అక్టోబర్ 9కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్

జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 05:25 PM