Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. సిట్ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Oct 03 , 2025 | 06:21 PM
విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ భారతీయ జనతా పార్టీ నేత ఉమా ఆనందన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. టీవీకే నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటషన్లపై ఆదేశాలను జస్టిస్ సెంథిల్ కుమార్ రిజర్వ్ చేశారు.
చెన్నై: తమిళనాడు (Tamilnadu)లోని కరూర్ (Karur)లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుకు మద్రాసు హైకోర్టు (Madras High Court) శుక్రవారం నాడు ఆదేశించింది. ప్రామాణిక కార్యాచరణ విధానాలు (Standard Operating Procedure) రూపొందించేంత వరకూ రాష్ట్ర, జాతీయ హైవేల వెంబడి రాజకీయ పార్టీల ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించింది.
విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ భారతీయ జనతా పార్టీ నేత ఉమా ఆనందన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. టీవీకే నేతలు ముందస్తు బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆదేశాలను జస్టిస్ సెంథిల్ కుమార్ రిజర్వ్ చేశారు.
కీలక ఆదేశాలివే..
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొజీజర్లు (SOPs) ఖరారు చేసేంతవరకూ రాష్ట్ర, జాతీయ హైవేలపై రాజకీయ పార్టీలు ఎలాంటి బహిరంగ సభలు, కార్యక్రమాలు నిర్వహించకుండా హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మధురై హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించాలని సూచించింది.
ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్
తమిళనాడు నార్త్ జోన్ ఐజీ అస్రాగార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. నమక్కల్ ఎస్పీ కూడా ఇందులో ఉంటారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తక్షణం సిట్‌కు అప్పగించాలని ఆదేశించింది హైకోర్టు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. నేపాల్‌లో జరిగిన తరహాలో రివల్యూషన్‌ను తమ పార్టీ తీసుకురానున్నట్టు పేర్కొంటూ టీవీకే నేత ఆధవ్ అర్జున్ చేసిన ట్వీట్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. తన ట్వీట్‌ను ఆధవ్ అర్జున్ ఆ తర్వాత తొలగించారు.
ఇవి కూడా చదవండి..
జాగ్రత్త.. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం..
పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి