Home » Heavy Rains
ఉత్తరాంధ్రలో కుండపోత వానలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం కారణంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో....
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోపైపు ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు.
విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. రహదారులు జలమయం అయ్యాయి.
హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతోండటంతో చెరువులు, వాగులకు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే, యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. జూలూరు - రుద్రవల్లి బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతి పొటెత్తింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.