Share News

Thunderstorm Alert: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:45 PM

50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

Thunderstorm Alert: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..
Thunderstorm Alert

అమరావతి, అక్టోబర్ 4: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.


🔴రెడ్ అలెర్ట్

విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


🟠ఆరెంజ్ అలెర్ట్

అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఎవరూ చెట్ల కింద ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.

కాగా, ఇప్పటికే వర్షాల దెబ్బకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వంశధార, నాగవళి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది నిరాశ్రయులు అయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

యాగి చేయాలనేదే జగన్ ఆలోచన.. మంత్రి ఫైర్

సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 04 , 2025 | 05:08 PM