Home » Heavy Rains
మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.
తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది వాతావరణ కేంద్రం. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొంది.
ఉత్తరకోస్తా, ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తుపాను దృష్ట్యా చేపట్టే చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాల్సిందేనని ఆజ్ఞాపించారు మంత్రి సవిత.
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులకి రాష్ట్ర సర్కార్ దిశానిర్దేశం చేసింది.
‘మొంథా’ తుపాను వస్తోందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని ఆదేశించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 3 గంటలుగా.. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల 27వ తేదీకి తుపానుగా బలపడనుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకి పలు సూచనలు చేశారు.
ఉభయ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద పొటెత్తుతోంది. ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో డ్యాం గేట్లు తెరిచి నీరు వదలాలని అధికారులు భావిస్తున్నారు. ఏక్షణమైనా గేట్లు తెరచి నీరు వదిలే అవకాశం ఉంది.