Home » Guntur
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు ఆయన భార్య పుష్పపై చీటింగ్ కేసు నమోదైంది. ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మంజూరు చేసిన రూ.68 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన లారీ మెకానిక్ సయ్యద్ ఇబ్రహీం ఖలీల్ ఈ నెల 18న బైక్ ఢీకొని గాయపడ్డారు.
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-నర్సాపూర్ మార్గంలో 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
గుంటూరు జిల్లాలోని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గుంటూరు మార్గం నార్త్ సైడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 236వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ప్రియుడితో కలిసి సొంత కూతురే తల్లిని దారుణంగా హతమార్చిన సంఘటన ఇది. తన తొమ్మిదేళ్ల కొడుకు చూస్తుండగానే శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
జిల్లాలోని పొన్నూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మృతి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రియుడితో కలిసి తల్లిని కుమార్తే హతమార్చిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల చిత్రహింసల కారణంగా మృతి చెందిన గుంటూరు జిల్లా తాడికొండ మండలం, పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి కేసును సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.