77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 08:47 AM
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మెుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, జనవరి 26: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మెుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు ట్వీట్..
‘సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభ దినోత్సవాన దేశ ప్రజలు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనల్ని మనం పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా జరుపుకుందాం. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ మనకు ఇచ్చిన రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసింది. ప్రతిఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కోరుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి లోకేశ్ ట్వీట్..
'77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మనదేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి పాటుపడుదాం' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గణతంత్ర దినోత్సవం వేళ కలకలం.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత..
భారత్ కీలక నిర్ణయం.. ఐరోపా కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు?