Share News

అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు మరోసారి గడువు పొడిగింపు

ABN , Publish Date - Jan 23 , 2026 | 08:05 PM

ఏపీలో అనధికార లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్లకు శుభవార్త! మీ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు మరోసారి గడువు పొడిగింపు
Andhra Pradesh Municipal News

అమరావతి: అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS)–2025 కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 23 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.


ఈ పథకం కింద అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు రూ.10,000 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌–2025 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 61,947 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు.


ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, నిబంధనల ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోపే దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ శాఖ కోరింది.


ALso Read:

సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 09:12 PM