Home » Gulf News
ఇరాన్ దాడులపై సౌదీ అరేబియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ఓపికకు కూడా హద్దులుంటాయని గ్రహించాలని పేర్కొంది. దేశ రక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఇరాన్‌ను హెచ్చరించింది.
అబుదాబి గ్యాస్ ప్లాంట్ల మీద ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీనిని యూఏఈ గాలిలోనే అడ్డుకున్నప్పటికీ, హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో శకలాలు పడ్డాయి. దీంతో గ్యాస్ ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిపివేశారు.
ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై మరికొన్ని గంటల్లో ఇరాన్ దాడి చేయబోతోందని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ కాసేపటి క్రితం ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద పట్టు సాధించేందుకు అమెరికా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం 'బంకర్ బస్టర్' బాంబులతో విరుచుకుపడింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలపై పడటంతో ఒక పురుషుడు, ఒక మహిళ మరణించారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, అమెరికా జరిపిన ఒక భారీ వైమానిక దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని సెకన్ల తేడాతో మృత్యువును జయించారు.
మేము సంధిని కోరలేదని.. చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం తప్పుడు ప్రచారమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. తమ ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని ప్రకటించారు.
ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది