ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అణు రంగానికి భారీ దెబ్బ.. ఖొండాబ్ ప్లాంట్ ఇక పనిచేయదు!
ABN , Publish Date - Mar 30 , 2026 | 07:22 AM
ఇరాన్‌లోని కీలకమైన ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడులు ఆ దేశ అణు కార్యక్రమాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ దాడిలో ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నదని, అది ఇక ఏమాత్రం పనిచేసే స్థితిలో లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది.
టెహ్రాన్, మార్చి 30: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఇరాన్‌లోని కీలకమైన ఖొండాబ్ (Khondab) హెవీ వాటర్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడులు.. ఆ దేశ అణు కార్యక్రమాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ దాడిలో ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నదని, అది ఇక ఏమాత్రం పనిచేసే స్థితిలో లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) అధికారికంగా ధృవీకరించింది.
ఇజ్రాయెల్ క్షిపణి దాడుల కారణంగా ప్లాంట్‌లోని ప్రధాన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల భారీ నీటి (Heavy Water) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా విడుదలైన IAEA నివేదిక ప్రకారం.. ప్లాంట్ పునరుద్ధరణకు చాలా సమయం, భారీ వ్యయం అవసరమవుతుంది. ప్రస్తుతానికి ఇది 'నాన్-ఆపరేషనల్' (పనిచేయని) స్థితిలో ఉందని ఐఏఈఏ నివేదిక వెల్లడించింది. ఇరాన్ అణు బాంబు తయారీకి అవసరమైన ప్లుటోనియం ఉత్పత్తి సామర్థ్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ ప్లాంట్‌ను ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్... డీఎంకే మేనిఫెస్టో
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ