Share News

యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిది.. 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:40 PM

ప్రస్తుత యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. ఈ కష్టకాలంలో భారత ప్రయోజనాలకు, ముఖ్యంగా చమురు సరఫరా, భారతీయుల భద్రతకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిది.. 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi Mann Ki Baat Gulf support

న్యూఢిల్లీ, మార్చి 29: పశ్చిమాసియాలో నెలకొన్న అత్యంత ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ కష్టకాలంలో భారత ప్రయోజనాలు, ముఖ్యంగా చమురు సరఫరా, భారతీయుల భద్రతకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు.

యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటున్నప్పటికీ, భారత్‌కు అవసరమైన ఇంధన వనరులను అందించడంలో గల్ఫ్ దేశాలు చూపుతున్న చొరవను ప్రధాని కొనియాడారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో స్వార్థ రాజకీయాలకు చోటు లేదని మోదీ స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.


గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇస్తున్న హామీ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, తక్షణమే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.


ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 01:20 PM