Home » Ganesh Nimajjanam
రేపు (శుక్రవారం) జరగబోయే ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గణేశ్ శోభాయాత్ర నేపథ్యంలో రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహా గణపతి పూర్తిస్థాయిలో మునిగేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.
భాగ్యనగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. నవరాత్రులు పూర్తవడంతో నిమజ్జనానికి వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం రోజు 25వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సైబరాబాద్ సీపీ ఎం.రమేశ్ పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సృజన, జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ఇతర డీసీపీలు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి విశేష పూజలు చేస్తున్న భక్తులు ఘనంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో విశాఖకు చెందిన డ్యాన్స్ హంగామా చేయడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆ డ్యాన్స్ బృందాన్ని ట్రాక్ చేసి.. ఇండియన్ రాక్ పైథాన్‌ను రక్షించారు.
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది.
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాన్ని నిషేధించడం దారుణమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల అరెస్ట్ దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
వినాయక నిమజ్జన ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పి ఓ కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న దంపతులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.