పాతిక లక్షలు పలికిన బందరు మహా గణపతి లడ్డూ ప్రసాదం
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:50 PM
బందరు సాగరతీర గణేశుని లడ్డూ అక్షరాల రూ.25 లక్షల వేలం పలికింది. అలాగే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గణేశుడి లడ్డూను ఏకంగా రూ. 36 లక్షలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మచిలీపట్నం, సెప్టెంబర్ 24: బందరు తీరంలో ఏర్పాటు చేసిన మహాగణపతి లడ్డూరూ. 25 లక్షలు పలికింది. ఈ లడ్డూను ఎఫ్‌సీఎస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గుమ్మడి భవానీ శంకర్ దక్కించుకున్నారు. ఈ మేరకు 630 కేజీల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భవానీ శంకర్‌కు ఇవ్వనున్నట్లు ఉత్సవ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
ఆఫ్ లైన్, ఆన్ లైన్‌లో నిర్వహించిన ఈ వేలం పాటలో సుమారు 600 మంది భక్తులు పాల్గొన్నారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. లడ్డూ వేలం మొదటగా రూ. 63 వేలతో ప్రారంభమైనట్లు వారు తెలిపారు. కాగా.. రేపు జరగనున్న వరసిద్ధి వినాయక స్వామి కల్యాణ ఉత్సవాలకు భవానీ శంకర్ దంపతులు హాజరుకానున్నారు. అనంతరం ఫైర్ జెట్‌ల సహాయంతో 63 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.
సంగారెడ్డి జిల్లాలో రూ. 36 లక్షలు పలికిన లడ్డూ
న్యాల్‌కల్ మండలం రాఘవాపూర్‌లోని సరస్వతి ఆలయంలో ప్రతిష్టించిన గణేశుని లడ్డూ ప్రసాదం రూ. 36 లక్షలు పలికింది. సదాశివ పేటకు చెందిన చింతల్ గట్టు వీరన్న అనే భక్తుడు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్
సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు: హరీశ్ రావు
Read Latest TG News And Telugu News