Home » Floods
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తుడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన పిల్లలను కాపాడడం కోసం చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం వరద ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. వరద తీవ్రత, నష్టాన్ని అంచనావేసింది. శివసాగర్ జిల్లాలో మరో ఏడుగురు మృతి చెందడంతో అస్సాం వరదల కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 75కు పెరిగింది.
అస్సాంలో వరద ఉధృతి స్వల్పంగా మెరుగుపడింది. గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇంకా 4.45 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురవుతున్నారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా వరదలు అస్సాంను అతలాకుతులం చేశాయి. అయితే శనివారం నాటికి వరద ప్రభావం కాస్త తగ్గింది. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
భారీ వర్షాలకు అస్సాం అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
జమ్మూకశ్మీర్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వరదల ధాటికి కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాటికి వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
చైనాలో టైఫూన్ బావి బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో లియావోనింగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో 2,60,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు అధికారులు వెల్లడించారు.