Home » Floods
బియాస్ నది పొంగిపొర్లుతుండటంతో మనాలిలోని ఒక బహుళ అంతస్తుల హోటల్, నాలుగు దుకాణాలు కొట్టుకుపోయాయి. మనాలి-లెహ్ హైవే పలు చోట్ల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్ల కనెక్టివిటీ, విద్యుత్ లేకపోవడంతో వందలాది మంది ప్రజలు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
జమ్మూలోని కథువా, సాంబ, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరుణుడు ప్రకోపించాడు. రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా చమోలి జిల్లాలో ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు.
అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదుల ఉదృతికి కున్నవరంలో పలు గ్రామాలు నీట మునిగాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి- కేశవాపురం మధ్య ఉన్న వాగులో వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోయింది... వనపర్తి జిల్లా నుంచి మదనాపూర్ మండలంలో ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది...
తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.
ఓ యువకుడు రీల్స్ చేయడం కోసం నది వద్దకు వెళ్లాడు. అక్కడ వరద నీరు పైనుంచి భారీ స్థాయిలో కిందకు దూకుతుంటుంది. ఈ క్రమంలో అతను వరద నీటిలోకి దిగి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.