Share News

Tungabgadra: ఉధృతంగా తుంగభద్ర.. నాలుగు చక్రాల బరువైన వాహనాలకు వంతెనపై బంద్‌

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:05 PM

తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.

Tungabgadra: ఉధృతంగా తుంగభద్ర.. నాలుగు చక్రాల బరువైన వాహనాలకు వంతెనపై బంద్‌

కంప్లి(బెంగళూరు): తుంగభద్ర(Tungabgadra) జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు. కేవలం ద్విచక్రవాహనం ఆటోలు, కార్లకు మాత్రమే అవకాశం కల్పించారు.


నాలుగు చుక్కలు బరువైన వాహనాలకు వంతెనపై బంద్‌ చేయడంతో బుక్కసాగర మీదుగా గంగావతికి చేరుకుంటున్నాయి. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదికి నీరు పోటెత్తడంతో సన్నాపురం వద్ద రైతన్నలు మోటార్లలోకి నీరు చేరడంతో మోటార్లు ధ్వంసమయ్యాయి.


pandu1.2.jpg

మోటార్లను విప్పి గట్టుకు చేరుస్తున్నారు. యేడాదికి మూడుసార్లు నదికి ఎక్కువగా నీరు పోటెత్తడం వల్ల మోటార్లకు నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై ఒక్కో మోటారు రూ.పది వేలతో రిపేరీ చేయించామని రైతులు తెలుపుతున్నారు. మొత్తానికి యేడాది వర్షపాతం ఎక్కువగా వుండటంతో పంటలకు తెగులు సోకే ప్రభావం కూడా వుందన్నారు. రైతుకి ఈసారి రైతుకు కష్టాలు ఎక్కువగా కలిగాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 04:41 PM