Share News

Flood Fury In Manali: వరద ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన హైవే

ABN , Publish Date - Aug 26 , 2025 | 05:44 PM

బియాస్ నది పొంగిపొర్లుతుండటంతో మనాలిలోని ఒక బహుళ అంతస్తుల హోటల్, నాలుగు దుకాణాలు కొట్టుకుపోయాయి. మనాలి-లెహ్ హైవే పలు చోట్ల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్ల కనెక్టివిటీ, విద్యుత్ లేకపోవడంతో వందలాది మంది ప్రజలు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయారు.

Flood Fury In Manali: వరద ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన హైవే
Himachal Pradesh

మనాలి: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఎడతెగని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనాలి (Manali)లో బియాస్ నది పొంగిప్రవహిస్తుండటంతో వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. పలు దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోగా, భవంతులు కుప్పకూలాయి. హైవేలు కోతకు గురయ్యాయి. పలు నివాస ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి.


బియాస్ బీభత్సం

బియాస్ నది పొంగిపొర్లుతుండటంతో మనాలిలోని ఒక బహుళ అంతస్తుల హోటల్, నాలుగు దుకాణాలు కొట్టుకుపోయాయి. మనాలి-లెహ్ హైవే పలు చోట్ల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్ల కనెక్టివిటీ, విద్యుత్ లేకపోవడంతో వందలాది మంది ప్రజలు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయారు. బహాంగ్‌లోని రెండంతస్తుల భవనం వరదనీటిలో కొట్టుకుపోగా, రెండు రెస్టారెంట్లు, రెండు దుకాణాలు కుప్పకూలాయి. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లోడింగ్‌తో ఉన్న హెవీ-డ్యూటీ ట్రక్ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఇంతవరకూ వాహనం జాడ కనిపించలేదని చెబుతున్నారు.


కులు-మనాలి మధ్య హైవే స్ట్రెచ్‌లు కొట్టుకుపోవడంతో లెహ్-మనాలి హైవేలో రాకపోకలను నిలిపివేశారు. బియాస్ నదిలో నీటిమట్టం ఆకక్మికంగా పెరగడంతో పత్లికుహాల్‌లోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ఒక ఫ్యాక్టరీలోని వస్తువులన్నీ కొట్టుకుపోయాయి.


ఇవి కూడా చదవండి..

వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

దోడాలో మెరుపు వరదలు, నలుగురు మృతి.. పలు ఇళ్లు నేలమట్టం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 07:03 PM