Share News

Guruvayur temple news: బిగ్‌బాస్ కంటెస్టెంట్ చేసిన అపచారం.. గురువాయూర్ ఆలయం సంప్రోక్షణకు నిర్ణయం..

ABN , Publish Date - Aug 26 , 2025 | 05:04 PM

సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు కారణమవుతున్నారు.

Guruvayur temple news: బిగ్‌బాస్ కంటెస్టెంట్ చేసిన అపచారం.. గురువాయూర్ ఆలయం సంప్రోక్షణకు నిర్ణయం..
Influencers Reel at Guruvayur Temple Sparks Controversy

సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు కారణమవుతున్నారు. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ దేవస్థానం వద్ద ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం చేసిన పని తీవ్ర వివాదాలకు కారణమైంది (influencer controversy).


మలయాళం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన జాస్మిన్ జాఫర్ (Jasmin Jaffar) ఇటీవల గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ ఆలయంలో ఉండే పవిత్ర కొలనులో తన కాళ్లను కడుక్కుంటూ వీడియో తీసుకుంది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం.. విగ్రహామూర్తులకు ఈ పవిత్ర కొలనులో స్నానం చేయిస్తుంటారు. ఈ కొలనులోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి లేదు. ఆ విషయం తెలియక జాస్మిన్ జాఫర్ ఆ కొలనులో తన కాళ్లు కడుక్కుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది (temple reel backlash).


ఈ వీడియోను వీక్షించిన ఆలయ అర్చకులు జాస్మిన్‌పై మండిపడ్డారు. జాస్మిన్ చేసిన పని వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భావించి, మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది (purification drive). ఈ రోజుల్లో ఆలయంలో భక్తుల దర్శనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు జాస్మిన్ జాఫర్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై జాస్మిన్ స్పందించింది. క్షమాపణలు వేడుకుంది. తనకు ఆ ఆలయ సాంప్రదాయలు తెలియకపోవడం వల్లే ఆ తప్పిదం జరిగిందని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చింది.

jasmin-jaffor.jpg


ఇవి కూడా చదవండి..

ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..

రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2025 | 06:13 PM