Home » Floods
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
25 ఏళ్ల తర్వాత మంజీరా బ్యారేజ్‌కి ఆ స్థాయి వరద వచ్చిందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద వచ్చిందని, మంజీరా బ్యారేజ్ ఫిల్టర్ బెడ్ నీట మునిగిందన్నారు.
భారీ వర్షాల కారణంగా వరద నీరు వీధుల్లో పొంగి ప్రవహిస్తోంది. దీంతో అంతా తలుపులు మూసుకుని ఇంట్లో ఉన్నారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి నుంచి బకెట్ పట్టుకుని బయటికి వచ్చాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
ఉత్తరాఖండ్‌లో మరోసారి మేఘ విస్పోటనం, డెహ్రాడూన్‌లో అర్ధరాత్రి మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. నదులన్నీ ప్రమాకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
పంజాబ్ వరదల్లో జరిగిన నష్టంపై కేంద్రం తక్షణమే పారదర్శక, కచ్చితమైన అంచనా చేపట్టాలని, సమగ్ర సహాయ పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
వర్షాకాలం సీజన్‌లో చోటుచేసుకున్న పెను విపత్తుపై ముఖ్యమంత్రి, అధికారులు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, కష్టకాలంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఇందుకు ప్రధాని పంజాబ్‌లో పర్యటించనుండటమే నిదర్శనమని బీజేపీ పంజాబ్ యూనిట్ తెలిపింది.
మునుపెన్నడూ లేనివిధంగా ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం సీరియస్ అయింది. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.