Share News

PM Modi Aerial Survey: హిమాచల్‌లో వరదల నష్టంపై ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:00 PM

వర్షాకాలం సీజన్‌లో చోటుచేసుకున్న పెను విపత్తుపై ముఖ్యమంత్రి, అధికారులు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.

PM Modi Aerial Survey: హిమాచల్‌లో వరదల నష్టంపై ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
PM Modi Aerial Survey in Himachal Pradesh

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వరదలు, కొండచరియలు విరిగిపడి భారీ ఆస్తి, ప్రాణనష్టం జరగడంతో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం నాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. పరిస్థితిని అంచనా వేసేందుకు మండి, కుల్లు జిల్లాల్లో ఏరియల్ సర్వే (Aerial survey) నిర్వహించారు. దీనికి ముందు రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి గగల్ విమానాశ్రయం వద్ద గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సాదర స్వాగతం పలికారు. విపక్ష నేత జైరామ్ ఠాకూర్, రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజీవ్ దింపాల్, పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.


వర్షాకాలం సీజన్‌లో చోటుచేసుకున్న పెను విపత్తుపై ముఖ్యమంత్రి, అధికారులు ప్రధానికి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.


రూ.4,122 కోట్ల నష్టం

జూన్ 20 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ క్లౌడ్ బరస్ట్‌లు, మెరుపు వరదలు, భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో రూ.4,122 కోట్ల మేరకు నష్టం జరిగిందని.. వర్షాలు, రోడ్డుప్రమాదాల్లో 370 మంది వరకూ మృతి చెందారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) తెలిపింది. మృతుల్లో 43 మంది కొండచరియలు విరిగిపడి, 17 మంది క్లౌడ్‌‍బరస్ట్‌లు, తొమ్మిది మంది మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోగా.. 205 మంది వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మృతి చెందారు. రాష్ట్రంలో 4 నేషనల్ హైవేస్‌ సహా 619 రోడ్లు మూసివేయగా, 1,748 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 461 వాటర్ సప్లై పథకాలకు అంతరాయం కలిగింది. ఈ సీజన్‌లో 6,344 ఇళ్లు, 461 దుకాణాలు, ఫ్యాక్టరీలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి.


ఇవి కూడా చదవండి..

క్యూలో నిలబడి ఓటు వేసిన ప్రియాంక గాంధీ

తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 04:22 PM