Vice President Election 2025: ఓటింగ్‌కు 14 మంది ఎంపీలు గైర్హాజర్
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:17 PM
వివిధ కారణాల రీత్యా ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్‌కు చెందిన ఏడుగురు రాజ్యసభ్యులు, కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
న్యూఢిల్లీ: నూతన ఉప రాష్ట్రపతి (Vice President)ని ఎన్నుకునేందుకు ఎంపీలు మంగళవారంనాడు తమ ఓటు హక్కును నియోగించుకుంటున్నారు. పార్లమెంటు హౌస్‌లోని 'ఎఫ్-101 వసుధ'లో పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు. అధికార ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), విపక్ష 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి (B Sudarshan Reddy) ముఖాముఖీ తలబడుతున్నారు.
గైర్హాజరైన ఎంపీలు వీరే
వివిధ కారణాల రీత్యా ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్ (BJD)కు చెందిన ఏడుగురు రాజ్యసభ్యులు, కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (BRS)కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు లోక్‌సభ సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. వారిలో ఇద్దరు ఇండిపెండెంట్లు, శిరోమణి అకాలీ దళ్ (SAD)కు చెందిన ఒక ఎంపీ ఉన్నారు.
11 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్‌సభ ఎంపీలు
రాజ్యసభ నుంచి గైర్హాజరైన ఏడుగురు బీజేడీ ఎంపీల్లో సస్మిత్ పాత్ర, దేబాశిష్ సమంతరాయ్, సుభాషిష్ ఖుంటియా, సులతా డియో, నిరంజన్ బిషి, మున్నా ఖాన్, మానస్ మాంగరాజ్, బీఆర్ఎస్‌కు చెందిన వడ్డిరాజు రామచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, డి.దామోదర్ రావు, బి.పార్థసారధి రెడ్డి ఉన్నారు. లోక్‌సభ ఎంపీల్లో హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (సాద్), సరబ్‌జీత్ సింగ్ ఖల్సా (ఇండిపెండెంట్), అమృత్‌పాల్ సింగ్ (ఇండిపెండెంట్) ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
క్యూలో నిలబడి ఓటు వేసిన ప్రియాంక గాంధీ
For More National News And Telugu News