Manjeera Barrage: 25 ఏళ్ల తర్వాత మంజీరా బ్యారేజ్‌కి ఈ స్థాయి వరద
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:27 PM
25 ఏళ్ల తర్వాత మంజీరా బ్యారేజ్‌కి ఆ స్థాయి వరద వచ్చిందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద వచ్చిందని, మంజీరా బ్యారేజ్ ఫిల్టర్ బెడ్ నీట మునిగిందన్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 27: ఇరవై ఐదేళ్ల తర్వాత మంజీరా బ్యారేజ్‌కి ఆ స్థాయి వరద వచ్చిందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో ఆయన ఇవాళ(శనివారం) వరద పరిస్థితి మీద ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద వచ్చిందని, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఇన్ ఫ్లో తగ్గిందని ఆయన వెల్లడించారు. భారీ వరదకు సంగారెడ్డిలోని మంజీరా బ్యారేజ్ ఫిల్టర్ బెడ్ నీట మునిగిందని వాటర్ బోర్డ్ ఎండీ చెప్పారు. రెండ్రోజుల్లో మంజీరా ఫిల్టర్ బెడ్ ని బాగు చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..