Home » Floods
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మొన్నటి వరకూ జెన్ జెడ్ ఆందోళనతో అట్టుడికిన దాయాది దేశం నేపాల్.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలం సెప్టెంబర్ చివరి వారంతో ముగిసినప్పటికీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. భారీగా వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆ రెండు నదులకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతోండటంతో చెరువులు, వాగులకు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే, యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. జూలూరు - రుద్రవల్లి బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతి పొటెత్తింది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికలకు చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. భద్రాచలం వద్ద 44.9లక్షలు, ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.