Home » Floods
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం మేఘ విస్ఫోటాలు సంభవించాయు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.
మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్‌మెంట్ సెల్లార్లు
తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చెరువులు, కట్టలు తెగిపోయి ప్రవహించాయి. 43 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎక్కడా లేని వరద నీరు జిల్లాల్లో ప్రవహించింది.
మాజీ మంత్రి హరీశ్‌రావు వరద బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందని డీజీపీ జితేందర్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.