Home » Fire Accident
అగ్నిప్రమాదాలు, వాటి నివారణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లె గ్రామ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది.
తమిళనాడు విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాత్తూర్‌లోని బాణసంచా కేంద్రంలో మంటలు చెలరేగాయి. మందుగుండు సామగ్రి పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో ఎండలు ముదురుతున్న వేళ ఊహించని అగ్నిప్రమాదాలు రైతన్నల కడుపు కొడుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం స్థానిక రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.
సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది.
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌తో పాటు టోలీచౌకిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
విశాఖపట్నంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ఆటోనగర్‌లో త్రుటిలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.
శ్రీనగర్‌లోని హైదర్‌పొరా ప్రాంతంలో ఉన్న జామియా అరేబియా అష్రాఫుల్ ఉలూమ్/దారుల్ ఉలూమ్ సెమినరీలో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ మూడో అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుని పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం టెర్మినల్ 1 బిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..