Massive Fire Accident ON Tamil Nadu: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Oct 03 , 2025 | 05:33 PM
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దపాలయం సమీపంలోని ఎర్నాకుప్పం అగరబత్తి ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ ఫ్యాక్టరీలో ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
తిరువళ్లూరు జిల్లా, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) జరిగింది. పెద్దపాలయం సమీపంలోని ఎర్నాకుప్పం అగరబత్తి ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ ఫ్యాక్టరీలో ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసేందుకు పొన్నేరి, తేవరాయ్, కాండిగై, తిరువళ్లూరు నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మొత్తం 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.10 కోట్ల విలువైన వస్తువులు బూడిదయ్యాయి. ఇవాళ(శుక్రవారం) సెలవు రోజు కావడంతో ప్రాణనష్టం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పెద్దపాలయం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
నా భర్తను విడిచిపెట్టండి.. సుప్రీంకోర్టుకు సోనం వాంగ్‌చుక్ భార్య
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి