Fire Accident in Bus: మంటల్లో ట్రావెల్స్ బస్సు.. రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్..
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:23 AM
ఎస్‌ఆర్ నగర్‌లో ట్రావెల్స్ బస్సులో అగ్ని అగ్నిప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఈ ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ట్రావెల్స్ బస్సులో అగ్ని అగ్నిప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఈ ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సును ఆపేసిన డ్రైవర్ రోడ్డుపైనే ఆపేశాడు. ప్రయాణికుల్ని కిందకు దింపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకొంది.
బస్సులో ఉన్న వారందరినీ క్షేమంగా కిందికి తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా కూకట్‌పల్లి నుంచి పంజాగుట్ట రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో మంటలు వచ్చే సమయానికి ముగిసిన మెట్రో సర్వీసెస్. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగ మెట్రో స్టేషన్ మొత్తం అలుముకుంది. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.