California fire: కాలిఫోర్నియాలో భారీ అగ్నిప్రమాదం.. ఎర్రగా మారిన రాత్రి
ABN , Publish Date - Oct 03 , 2025 | 02:33 PM
అమెరికాలోని కీలక నగరం కాలిఫోర్నియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్ రిఫైనరీలో పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాలిఫోర్నియా, అక్టోబర్ 3: అమెరికాలోని కీలక నగరం కాలిఫోర్నియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్ సెగుండోలోని చెవ్రాన్ ఆయిల్ రిఫైనరీలో పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (LAX) సమీపంలో జరిగింది.
అగ్నిప్రమాద తీవ్రతకు రాత్రి ఎర్రగా పగటిపూటలాగా మారిపోయింది. ఈ ప్రమాదం గురించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాద తీవ్రత ఎంతంటే, మంటలు మైళ్ల దూరం నుంచి కనిపించాయి. ఎల్ సెగుండో, మన్హట్టన్ బీచ్, రెడోండో బీచ్, లాస్ ఏంజిల్స్ కౌంటీ నుంచి వచ్చిన 100కి పైగా అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించాయి.
అగ్నిమాపక దళాలు వెంటనే స్పందించడంతో మంటలు పరిశ్రమలోని ఒకే యూనిట్‌కు పరిమితమయ్యాయి. ఈ ఉదయం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. సమీపంలోని భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు చెబుతున్నారు.
అయితే మన్హట్టన్ బీచ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక షెల్టర్-ఇన్-ప్లేస్ ఆర్డర్ జారీ చేశారు. గవర్నర్ గావిన్ న్యూసం సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే, ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి...
మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ
Read Latest AP News And Telugu News