Home » Elections
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
154 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని మంత్రి డోల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఈరోజు పులివెందులలో కూడా వైసీపీ ఓటమి ఖాయమని.. వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఓటమిని జీర్ణించుకోలేక రెక్కింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి డోల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు.
టీడీపీకి అనుకూలంగా ఓటు వేయెుద్దంటూ కేకలు పెడుతూ కారు ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
ఉమ్మడి కడప జిల్లాలో మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగనుంది.
మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్‌చుప్‌గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండు జాతీయపార్టీల ఎజెండా బీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమేనని, అందుకే ప్రధాని మోదీ ఇప్పటివరకు కుంభకోణాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సీఎంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శించారు.