Home » Election Commission
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు కోల్‌కతాలో నిరసనల సెగ తగిలింది. ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని సోమవారం ఉదయం దర్శించేందుకు వచ్చిన ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 28వ తేదీనాటికి మొత్తం 7.04 కోట్ల మంది ఎన్నికల జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించాలని పలు పార్టీలు సూచించినట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. వారి విజ్ఞప్తులను వివిధ కోణాల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తికావడంతో తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారంనాడు విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది.
ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయింది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది.
మున్సిపల్ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఓటు వేయడానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్హులు కారని చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ అభ్యర్థి మృతిచెందడంతో ఆరో వార్డులో పోలింగ్‌ను వాయిదా వేశారు అధికారులు.
ఎన్నికల కమిషన్‌కు 2025-26లో రూ.304.98 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, 2026-27 బడ్జెట్‌లో ఈ మెుత్తాన్ని రూ.382.22 కోట్లకు పెంచారు.
తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు సమాచారం.
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పదారి పట్టిస్తూ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లిందని ఆరోపించారు.