• Home » Donald Trump

Donald Trump

అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం..

అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం..

శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు..

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ పక్కనున్న రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

ఇరాన్‌లో పాఠశాలపై అమెరికా క్షిపణుల దాడి.. ఖండించిన ట్రంప్

ఇరాన్‌లో పాఠశాలపై అమెరికా క్షిపణుల దాడి.. ఖండించిన ట్రంప్

దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో అమెరికా పాత్ర ఉందంటూ వస్తున్న వార్తలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఈ దాడికి ఎవరు బాధ్యులో ఎప్పటికీ తెలియకపోవచ్చునని ఆయన తెలిపారు.

ఇరాన్‌కు మేము ఎలాంటి డబ్బూ ఇవ్వట్లేదు: డొనాల్డ్‌ ట్రంప్‌

ఇరాన్‌కు మేము ఎలాంటి డబ్బూ ఇవ్వట్లేదు: డొనాల్డ్‌ ట్రంప్‌

ఇరాన్‌కు ఆర్థిక సాయం అందించటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు తాము ఎలాంటి డబ్బూ ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు.

'భారతీయులు రూపాయి తీయరు'.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య!

'భారతీయులు రూపాయి తీయరు'.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య!

ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది.

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు

నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు

అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించిన కీలక కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

ట్రంప్ ప్లాన్‌కు చెక్.. అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం

ట్రంప్ ప్లాన్‌కు చెక్.. అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం

ట్రంప్ ఏకపక్ష సైనికాధికారాలకు చెక్ పెట్టేలా అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

 'నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'..  ట్రంప్ ఆగ్రహం

'నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'.. ట్రంప్ ఆగ్రహం

ఇరాన్‌‌తో ఘర్షణల నేపథ్యంలో తన సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది.. తన పనిని మరింత కష్టం చేసిందని, ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు సహాయం, ఓదార్పు అందించినట్లైందని విమర్శించారు.

ట్రంప్ యుద్ధ అధికారాలకు అమెరికా సెనేట్ బ్రేక్.. ఇరాన్ సైనిక చర్యలపై కీలక తీర్మానం ఆమోదం

ట్రంప్ యుద్ధ అధికారాలకు అమెరికా సెనేట్ బ్రేక్.. ఇరాన్ సైనిక చర్యలపై కీలక తీర్మానం ఆమోదం

అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన, కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యలు తీసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ సెనేట్ ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.

 అమెరికా నియంత్రణలో ఆ డబ్బులు.. ఇరాన్ ఫండ్స్‌పై ట్రంప్ కామెంట్లు..

అమెరికా నియంత్రణలో ఆ డబ్బులు.. ఇరాన్ ఫండ్స్‌పై ట్రంప్ కామెంట్లు..

ఇరాన్‌కు నిధులు ఇవ్వటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆంక్షల సడలింపు ద్వారా అన్‌ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి