ఇరాన్‌కు చైనా ఆయుధాలు ఇవ్వడం లేదు: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:51 PM
ఇరాన్‌కు తాము ఆయుధాలు పంపడం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు. ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న వార్తలు కొద్ది రోజులుగా వెలువడుతున్న సంగతి తెలిసిందే.
ఇరాన్‌కు తాము ఆయుధాలు పంపడం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు. ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న వార్తలు కొద్ది రోజులుగా వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేఖ రాశారు. దానికి జిన్‌పింగ్ జవాబిచ్చినట్టు ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు (Trump Xi Jinping Iran weapons).
'ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని కోరుతూ నేను జిన్‌పింగ్‌కు ఒక లేఖ రాశాను. చైనా ఆ పని చేయడం లేదని చెబుతూ జిన్‌పింగ్ నాకు జవాబిచ్చారు' అని ట్రంప్ అన్నారు. మే నెల ప్రారంభంలో బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో ట్రంప్ సమావేశం కానున్నారు. కాగా, ఇరాన్‌కు ఏ దేశమైనా సైనిక సహాయం అందిస్తే అమెరికా కఠిన చర్యలు తీసుకుంటుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అవసరమైతే భారీ టారిఫ్‌లు విధిస్తామని సంకేతాలు ఇచ్చారు (China denies arming Iran).
'నేను హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరుస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉంది' అని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో అన్నారు (US Iran tensions 2026). 'ఇరాన్‌కు ఆయుధాలు పంపడం లేదని వారు అంగీకరించారు' అని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశం ఇరాన్‌కు ఎలాంటి సైనిక మద్దతు ఇవ్వడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలి రోజుల్లో తరచుగా ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..
ఇరాన్‌తో చర్చలు.. అమెరికా పెట్టిన రెండు షరతులు అవేనా..