Share News

మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:28 PM

అమెరికాతో రెండో సారి శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఇటీవల జరిగిన యుద్ధంలో తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, దాదాపు 270 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.

మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..
Iran war compensation

అమెరికాతో రెండో సారి శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఇటీవల జరిగిన యుద్ధంలో తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, దాదాపు 270 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. తమకు జరిగిన నష్టాలను భర్తీ చేసేందుకు ఇతర దేశాలు సహాయపడాలని ఇరాన్ కోరుకుంటోంది (Iran war compensation).


యుద్ధం కారణంగా దేశంలోని మౌలిక సదుపాయాలు, గృహాలు, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ నష్టాన్ని దేశం ఒంటరిగా భరించడం సాధ్యం కాదని, అంతర్జాతీయ స్థాయిలో పరిహారం అవసరమని ఇరాన్ పేర్కొంది. గృహ నిర్మాణాలు, మౌలిక వసతులు ధ్వంసం అవడమే కాకుండా, చమురు, వాణిజ్య రంగాల్లో మూసివేత వల్ల నష్టాలు భారీగా ఉన్నాయని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నష్టాల అంచనా ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు ($270 billion Iran loss).


తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై పన్ను విధించడం వంటి చర్యలను కూడా ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం (US Iran talks 2026). కాగా, యుద్ధ సమయంలో ఐదు అరబ్ దేశాలు తమ భూ భాగాన్ని ఉపయోగించేందుకు అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు అనుమతి ఇచ్చాయని, ఆ దేశాలు కూడా తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ ఇప్పటికే కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి...

డీలిమిటేషన్‌‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ వ్యాఖ్యలు అంబేడ్కర్ ఆశయాలకు వ్యతిరేకం: కిషన్ రెడ్డి

Updated Date - Apr 15 , 2026 | 04:37 PM