Share News

ఇరాన్‌తో యుద్ధం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.. అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..

ABN , Publish Date - Apr 15 , 2026 | 02:11 PM

ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం అమెరికాకు అటు ఆర్థికంగా, ఇటు సైనిక పరంగా తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. అంతేకాదు.. ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం పట్ల చాలా మంది అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. తాజా సర్వేల ప్రకారం ఎక్కువ మంది అమెరికన్లు ఇరాన్‌తో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నారు.

ఇరాన్‌తో యుద్ధం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.. అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..
US-Iran war

ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం అమెరికాకు అటు ఆర్థికంగా, ఇటు సైనిక పరంగా తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. అంతేకాదు.. ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం పట్ల చాలా మంది అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. తాజా సర్వే ప్రకారం ఎక్కువ మంది అమెరికన్లు ఇరాన్‌తో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నారు. యుద్ధం వల్ల దేశానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు (Americans opinion on Iran war).


ఇటీవల ఇప్సాస్-రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో 65 శాతం మంది డెమోక్రాట్లు, 56 శాతం మంది ఇండిపెండెంట్లు, 40 శాతం మంది రిపబ్లికన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సర్వే ప్రకారం.. ఇరాన్ యుద్ధం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ లేదని 54 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ఈ దాడులతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని తెలిపారు. కాగా, ఇరాన్‌పై దాడులు సరైనవేనని 24 శాతం మంది అంగీకరించినట్టు సర్వే పేర్కొంది (US-Iran tensions 2026).


డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో కూడా 54 శాతం మంది మాత్రమే ఈ యుద్ధాన్ని సమర్థించారు (Iran conflict news). మిగతా వారు ఈ యుద్దం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా ప్రజల్లో స్పష్టమైన సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. శాంతి మార్గానికే మెజారిటీ ప్రజలు మద్దతు ఇస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీలిమిటేషన్‌‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ వ్యాఖ్యలు అంబేడ్కర్ ఆశయాలకు వ్యతిరేకం: కిషన్ రెడ్డి

Updated Date - Apr 15 , 2026 | 02:11 PM